ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.
హిజ్రాలు నిర్వహించిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోనాలిసా అనే హిజ్రాల గ్యాంగ్ లీడర్ తమపై దాడి చేసిందంటూ పలువురు హిజ్రాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకుంటుండగా ఏడుగురికి గాయాలయ్యాయి.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు 4తులాల(40 గ్రాముల) బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలో సోమవారం పట్టపగలే జరిగింది.
క్యాన్సర్ వల్ల కుమారుడు చనిపోగా ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆపై మద్యానికి బానిసయ్యాడు. ఆఖరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువుచాలించాడు. ఈ సంఘటన సంజీవయ్యనగర్‌లో జరిగింది.
బెంగళూరులో తాజాగా మరో డిజిటల్ అరెస్టు ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్సిల్లో నిషేధిత పదార్థులు ఉన్నాయని బెదిరించిన నిందితులు ఏకంగా రూ.31.83 కోట్లను తన నుంచి దోచుకున్నారని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 6వ తరగతి చదివే తన కూతురికి టీచర్ 100 గుంజిళ్లు తీయమని శిక్ష విధించడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతిని మరణించిందని బాలిక తల్లి ఆరోపించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో వరుడు వధువును రాడ్డుతో కొట్టి పొట్టన పెట్టుకున్నాడు. ఏడాదిన్నరగా ఆ యువ జంట సహజీవనంలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
గంజాయిని బిస్కెట్ల రూపంలోకి మార్చి పోలీసు కళ్లుగప్పి విక్రయాలు చేపడుతున్న 42యేళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ఎస్టేట్ సమీపంలో తనిఖీలు చేస్తు న్న పోలీసులు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను ఆపి ఆమె బ్యాగు తనిఖీ చేశారు.
భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్ కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి సుర్వి విశాల్‌గౌడ్(28), మల్లాపూర్‌లో నివాసం ఉండే నవ్య(25)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు.