Share News

బధిర యువతిపై తండ్రి అత్యాచారం

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:51 AM

ముంబైలో దారుణం జరిగింది. చెవిటి, మూగ అయిన ఓ యువతి అత్యాచారానికి గురై, గర్భం దాల్చింది. కన్నతండ్రి సహా 17 మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లు సేకరించారు.

బధిర యువతిపై తండ్రి అత్యాచారం

  • ఐదునెలల గర్భం.. 17 మంది నుంచి శాంపిళ్ల సేకరణ

  • కన్నతండ్రిదే దుర్మార్గం అని తేల్చిన వైద్య పరీక్షలు

ముంబై, ఫిబ్రవరి 5: ముంబైలో దారుణం జరిగింది. చెవిటి, మూగ అయిన ఓ యువతి అత్యాచారానికి గురై, గర్భం దాల్చింది. కన్నతండ్రి సహా 17 మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లు సేకరించారు. అయితే గర్భస్థ శిశువుకు తండ్రి బాధితురాలి తండ్రే అని వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ముంబైలో ఈ ఘోరం వెలుగుచూసింది. గత ఏడాది సెప్టెంబరులో బాధితురాలైన యువతి తన కడుపులో ఏదో కదులుతున్నట్టు ఇబ్బందిగా అనిపిస్తోందని అమ్మమ్మకు చెప్పుకొంది. ఆ వృద్ధురాలు ఆమెను వెంటబెట్టుకొని ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు, ఆమె ఐదునెలల గర్భవతి అని తేల్చారు. ఆ వెంటనే ఈ విషయాన్ని వైద్యులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బధిరురాలు కావడంతో బాధితురాలి నుంచి విషయాన్ని రాబట్టడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే తన కూతురిపై అత్యాచారం జరిగిందని గానీ, గర్భం దాల్చిందని గానీ ఆమె తండ్రి ఫిర్యాదు చేయకపోవడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. అయితే కౌన్సెలింగ్‌ అనంతరం, యువతి సైగల ద్వారా చెప్పిన అంశాల ఆధారంగానే కేసు నమోదు చేశారు. యువతి తండ్రి, ఓ 17 ఏళ్ల బాలుడు సహా మొత్తంగా 17మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. గతనెల 27న వైద్య నివేదిక వచ్చింది. పరీక్షల్లో గర్భస్థ శిశువు, బాధితురాలి తండ్రి శాంపిళ్లు సరిపోయినట్లు నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Feb 06 , 2026 | 02:51 AM