విజయారెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొలిక్కి..
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:54 AM
ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చిందా!?, మిస్టరీ నేడో రేపో వీడనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు పోలీసులు.
మిస్టరీ వీడనుందా!?
బోడుప్పల్‌లోని ఇల్లు, ల్యాప్‌టాప్,
మొబైల్ సీడీఆర్‌లలో ఆధారాల సేకరణ
భర్త పుట్టినరోజు ఘడియలు వచ్చిన తర్వాత
మరీ రైలుకింద పడి ఆత్మహత్య
పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు..
నేడు వెల్లడించే అవకాశం
హైదరాబాద్ సిటీ: ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి(Vijayareddy) కేసు కొలిక్కి వచ్చిందా!?, మిస్టరీ నేడో రేపో వీడనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకోవడానికి ఆమెను పురిగొల్పిన బలహీన కారణాలు ఏమిటనే అంచనాకు పోలీసులు వచ్చినట్లు తెలిసింది. విజయా రెడ్డి మొబైల్, ల్యాప్‌టా్‌పను స్వాధీనం చేసుకొని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది.
అలాగే, బోడుప్పల్‌లోని ఆమె ఇంట్లో కూడా కొన్ని ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఆమె మొబైల్ కాల్ రికార్డులనూ పోలీసులు జల్లెడ పట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు..? ఏమిటా క్రైమ్ కథా చిత్రం అనేది రైల్వే దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కేసును వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు పలు షాకింగ్ విషయాలను గుర్తించినట్లు సమాచారం. ఈ అంశాలను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పెళ్లి రోజు.. పుట్టిన రోజు మధ్య...!
జనవరి 28న విజయారెడ్డి-సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు. కాగా.. జనవరి 31న ఆమె భర్త సురేందర్ రెడ్డి పుట్టిన రోజుగా తెలిసింది. వారి పెళ్లి రోజుకు, భర్త పుట్టిన రోజుకు మధ్య కేవలం రెండు రోజుల గ్యాప్. జనవరి 30న రాత్రి సుమారు 10:30 నుంచి 11 గంటల మధ్య పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చిన విజయారెడ్డి.. కారును ఆవరణలో పార్కు చేసి కారు తాళాలు కొడుకు జేబులో పెట్టి స్టేషన్‌లోకి వెళ్లారు.
చర్లపల్లి- ఘట్‌కేసర్ ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళ్లి.. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే భర్త పుట్టినరోజున సుమారు ఒంటిగంట సమయంలో ఇద్దరు పిల్లలను గుండెకు హత్తుకుని రైలు కిందపడి ప్రాణాలు వదిలారు. పెళ్లి రోజుకు, భర్త పుట్టిన రోజుకు మధ్య ఉన్న ఆ రెండు రోజుల్లో ఏమైంది..? అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మొబైల్ సీడీఆర్, డేటా రీట్రీవ్, ఇతర టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాల ప్రకారం విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
లంచం తీసుకుని.. తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!
చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు
Read Latest Telangana News and National News