ప్రాణం తీసిన సిగరెట్..
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:19 AM
సిగరెట్ వ్యసనం ఒకరి ప్రాణం తీసింది. తాగిన మైకంలో వెలిగించిన సిగరెట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి చెందాడు.
- అగ్ని ప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి
హైదరాబాద్: సిగరెట్ వ్యసనం ఒకరి ప్రాణం తీసింది. తాగిన మైకంలో వెలిగించిన సిగరెట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి చెందాడు. కుటుంబసభ్యులు, ఎస్‌ఆర్.నగర్ డివిజన్ ఏసీపీ రాఘవేంద్రరావు తెలిపిన ప్రకారం.. ఎ.చెన్నకేశవులు (68) సైన్యంలో పనిచేసి 1994లో రిటైర్ అయ్యారు. హెచ్.ఎఫ్.నగర్‌లోని ఇంట్లో భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు. మద్యంతో పాటు సిగరెట్ తాగే అలవాటున్న అతడు ఇంటి రెండో అంతస్తులోని పెంట్ హౌస్‌లో ఒంటరిగా మద్యం, సిగరెట్లు తాగేవారు.
శుక్రవారం సాయంత్రం కూడా చెన్నకేశవులు మద్యం తాగిన అనంతరం సిగరెట్ కాలుస్తూ మత్తులోకి వెళ్లాడు. సిగరెట్ వల్ల గదిలోని సోఫా, పరుపులకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. కాళ్ల నొప్పులు ఉన్న అతడు నడవలేనందున మంటల్లో చిక్కుకొని మృతిచెందాడు. పెంట్‌హౌస్ నుంచి వచ్చిన మంటలను స్థానిక ముస్లిం యువకులు నీటితో ఆర్పివేశారని మృతుడి వియ్యంకుడు పూజారి శరణ్‌రెడ్డి తెలిపారు. సంఘటన స్థలానికి బోరబండ ఇన్‌స్పెక్టర్ సురేందర్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీమ్ సభ్యులు సందర్శించి వివరాలు సేకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
లంచం తీసుకుని.. తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!
చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు
Read Latest Telangana News and National News