కాసులకు కక్కుర్తిపడి, కమీషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పులపాలైన వారిని టార్గెట్గా చేసుకుని వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీసు కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేక నానాతంటాలు పడుతున్నారు.
మరణం కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, ఆ విషయం తెలిసి అతని స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుప్పూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మద్యం తాగనీయకుండా కూతురు అడ్డుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కన్నియాకుమారిలో చోటుచేసుకుంది. ముంగిల్విలైలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుడు రాజేంద్రన్ (49)కు అఖిల (47) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రహరీ గోడ కూలి నర్సింగ్ విద్యార్థిని మృతిచెందిన ఘటన విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పాత వెల్లయాపురానికి చెందిన వీరమణి కుమార్తె భవాని (17) శివకాశిలోని ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది.
తన భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడని కోపంతో ఓ యువకుడు స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాలాపూర్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో బుధవారం మంటలు చెలరేగాయి. నాదర్గుల్ బ్రాంచ్కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏసీ బస్సు లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.
మూసాపేట్ మెట్రో స్టేషన్(Moosapet Metro Station)లో ఈనెల 18న తనిఖీల్లో బయట పడిన 9ఎంఎం బుల్లెట్ ఎవరిది?. ఆ యువకుడి చేతికి ఎలా వచ్చింది.. అనే దానిపై మిస్టరీ వీడలేదు. దాంతో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నల్లమాడ మండలంలోని ఎన్.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్ మృతిచెందాడు.
ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.
నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు.