Chennai New: ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం ఏంటో తెలిస్తే...
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:10 PM
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్పైకి అన్నీతానై పెంచిన పినతల్లి మృతిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- పినతల్లి మృతిని తట్టుకోలేక..
చెన్నై: బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తనను పెంచి పెద్ద చేసిన పినతల్లి ఆకస్మిక మృతిని తట్టుకోలేక ఎస్సై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమ్మయార్‌కుప్పంలో స్థానికుల కంటతడిపెట్టించింది. అమ్మయార్‌కుప్పంలో కుమరన్, జయంతి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. కుమరన్(Kumaran) ఆర్కేపేట స్టేషన్‌లో స్పెషల్ ఎస్సైగా పనిచేస్తున్నారు.
బాల్యంలో కుమరన్ తల్లిదండ్రులు కోల్పోవటంతో ఆయన పినతల్లి వేదవళ్లి అతడిని చేరదీసి పెంచి పెద్ద చేసింది. బాగా చదివించి ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించేందుకు కారణమైంది. దీంతో పినతల్లి సంరక్షణ బాధ్యతల్ని కుమరన్ నిర్వర్తించేవాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులకు ముందు వేదవళ్లి అనారోగ్యంతో మృతి చెందటంతో ఆయన దిగ్ర్భాంతి చెందారు. ఆహారం కూడా ముట్టకుండా విరక్తితో గడిపారు. వీటికి తోడు పినతల్లి అంత్యక్రియలు చేసేందుకు కుమరన్ చేసిన ప్రయత్నాలను ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.

దీనితో మానసికంగా మరింతగా క్రుంగిపోయి గురువారం రాత్రి ఇంటిలోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం వేకువజాము నిదురనుండి లేచిన జయంతి భర్త ఉరివేసుకుని శవంగా వేలాడుతుండటం చూసి భీతిల్లింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కుమరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్
Read Latest Telangana News and National News