ఆన్‌లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...
ఇండిగో విమానంలో క్యాబిన్ క్రూ గా పనిచేస్తున్న జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తా (25) ఈనెల 24న రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, మృతురాలి తల్లి సోనిక గుప్తా వెల్లడించారు.
ఆరువందల రూపాయల కోసం చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నలుగురు హోటల్ సిబ్బంది టూరిస్టు గైడ్‌ను చితకబాదడంతో తీవ్రగాయాలపాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమ్మ ప్రేమకు నోచుకోవాల్సిన శిశువు మురుగు కాలువలో విగతజీవిగా కనిపించడం స్థానికులను కలిచివేసింది. తల్లి ఆప్యాయత, అనురాగాలకు ఏ శిశువు కూడా దూరం కాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఫేస్‌బుక్‌లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మగబిడ్డ కోసం భర్తే భార్యను వేరొకరితో అఫైర్ పెట్టుకోవాలని ఒత్తిడి చేసిన ఘటన చాలా మందిని నివ్వెరపరుస్తోంది. అబ్బాయి కావాలనే కోరికతో అత్తింటివారు ఓ మహిళపై దారుణాలకు పాల్పడ్డారు. ముందుగా ఆమెకు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారు.
షాపులో కూర్చుని ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని బయటకు లాగి పది మంది దుండగులు తీవ్రంగా దాడి చేశారు. వీరిలో కొందరు వారిపై దాడి చేస్తుండగా, మరికొందరు ఈ దాడిని వీడియో తీస్తూ గంతులు వేశారు. దాడితో గ్రామమంతా అట్టుడికిపోయింది.
సెల్‌ఫోన్ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది.
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకుంది.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను ప్రేమించకుంటే మీ కుటుంబాన్ని చంపేస్తా’ అని బాలికను వేధించిన యువకుడిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు... చిత్తూరు జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్ తిరుపతిలోని ఒక అపార్టుమెంటులో కాపురముంటున్నాడు.