Madhyapradesh Shocker: మహిళ ఆత్మహత్య.. భర్త తన తల్లికి నెయ్యి ఇచ్చాడని..
ABN , Publish Date - Jan 16 , 2026 | 07:05 PM
మధ్యప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన మాట కాదని భర్త నెయ్యిని తన తల్లికి ఇచ్చాడని తెలిసి కోపంతో ఊగిపోయిన ఓ మహిళ విషం తాగింది. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెయ్యి విషయంలో తన అత్తతో గొడవపడ్డ ఓ మహిళ క్షణికావేశంలో విషం తాగింది. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. శివపురి జిల్లాలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది (Dispute Over Ghee leads to MP Woman's Death).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇమ్లోడీ గ్రామంలో ఈ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. సోనమ్, ధన్‌పాల్‌ల వివాహం 2018లో జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో గొడవల కారణంగా ఆ దంపతులు కొంత కాలంగా వేరు కాపురం పెట్టారు. అయితే, గురువారం ఉదయం ధన్‌పాల్ తల్లి కోడలు సోనమ్‌ను కొంత నెయ్యి అడిగింది. కానీ అత్త అభ్యర్థనను సోనమ్ తొలుత తిరస్కరించింది. చివరకు భర్త ఒత్తిడి మేరకు ఆమె అత్తకు 100 గ్రాముల నెయ్యిని ఇచ్చింది.
ఆ తరువాత ధన్‌పాల్ తన భార్య మాటను కాదని తన తల్లికి మరి కొంత నెయ్యిని ఇచ్చాడు. ఇది తెలిసి సోనమ్ కోపంతో ఊగిపోయింది. క్షణికావేశంలో విషం తాగేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. స్వల్ప వివాదం ఆ కుటుంబానికి తీరని నష్టం మిగల్చడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి:
లాటరీ విజేతకు షాక్.. రూ.1 కోటి విలువైన లాటరీ టిక్కెట్‌ను విక్రయించబోతే..
అమానుషం.. దుస్తులు పాడు చేసుకుందని చిన్నారిని కొట్టడంతో..