Share News

Kit String Related Death: కుటుంబాన్ని బలి తీసుకున్న మాంజా! బైక్‌పై వెళుతుండగా..

ABN , Publish Date - Jan 15 , 2026 | 09:31 PM

మాంజా కారణంగా మరో కుటుంబం బలైపోయింది. తమ కూతురితో కలిసి బైక్‌పై వెళుతున్న ఓ జంట ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి మరణించారు. సూరత్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.

Kit String Related Death: కుటుంబాన్ని బలి తీసుకున్న మాంజా! బైక్‌పై వెళుతుండగా..
Kite String Related Death In Surat

ఇంటర్నెట్ డెస్క్: మాంజాలు యమపాశాలుగా మారుతూ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లకు కారణమవుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో ఓ కుటుంబం మొత్తం మాంజాకు బలైపోయింది. గుజరాత్‌లోని సూరత్‌లో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది (Kite String Related Death in Surat).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, నగరంలోని చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్‌పై ఈ దారుణం జరిగింది. రేహాన్ తన భార్య, రిహానా, కూతురు అయేషాతో కలిసి బైక్‌పై వెళుతుండగా అతడి ఒంటికి మాంజా చుట్టుకుంది. ఈ క్రమంలో అతడి బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడకు బలంగా ఢీకొంది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న ముగ్గురు 70 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. రేహాన్, అతడి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. రిహానా మాత్రం ఆటోపై పడటంతో తీవ్రగాయాల పాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.


దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చైనా మాంజా కారణంగా అనేక మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు అత్యధిక రిస్క్‌ను ఎదుర్కొన్నారు.

ఇవీ చదవండి:

హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?

Updated Date - Jan 21 , 2026 | 09:49 PM