నగర పాలక సంస్థ షరాబ్ కౌంటర్‌లో రూ.70 లక్షలు మాయం ఘటనలో మరో ముగ్గురిని నగర పాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ సస్పెండ్ చేశారు.
పచ్చని పంట లతో కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు ఎల్‌నినో ప్రభా వంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నెర్రలు చాచి బీడు వారుతున్నాయి.
పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని, దానితో పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, ఈ రెండు ఏళ్ల కాలంలో నియోజక వర్గానికి రూ.1,170 కోట్లు నిధులు తీసుకువచ్చినట్టు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
కూటమి పాలనలో నరసాపురంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఒక్కక్కటి పరిష్క రిస్తున్నది.
అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తూ చెలామణి అవుతున్న గొడ్డలి పార్టీని రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మహిళలను అవహేళన చేస్తూ కించపరుస్తున్న గొడ్డలి పార్టీ నాయకులను వారే నిలదీయాలని స్పష్టం చేశారు.
పోలవరం ఆర్‌అండ్‌ఆర్ భూ సేకరణలో అక్ర మాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులకు చెప్పినట్టు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.
యువ తను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనం దరిపై ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు.
గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 20 నుంచి 23 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈవో చందన తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల మధ్య రాజుల్లంక–రామేశ్వరం వద్ద వశిష్ట గోదావరిపై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణ టెండర్లు ఖరారయ్యాయి.
అండర్–19 జిల్లా క్రీడాజట్ల ఎంపిక పోటీలు ఈనెల 23 నుంచి నిర్వహిస్తామని డీవీఈవో టి.శేఖర్‌బాబు, అండర్–19 స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్, అంతకు లోపు చదువుతున్న బాలబాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు.