పల్లెపోరుకు సిద్ధమేనా..?
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:21 AM
ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను జనవరిలోనే నిర్వహిస్తున్నట్టు గతంలోనే సంకేతా లు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలోనూ ఎన్నికలపై రాజకీయ శ్రేణులు హడావిడి చేశాయి.
ఆ తర్వాతే నోటిఫికేషన్..
ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ
ఏప్రిల్ 2తో ముగియనున్న పాలకవర్గాల గడువు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను జనవరిలోనే నిర్వహిస్తున్నట్టు గతంలోనే సంకేతా లు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలోనూ ఎన్నికలపై రాజకీయ శ్రేణులు హడావిడి చేశాయి. రిజర్వేష న్‌లపై అంచనాకు వచ్చాయి. అభ్యర్థులను అంచ నా వేసుకుంటూ గెలుపోటములపై చర్చ సాగిం ది. ఎన్నికల్లో ఖర్చులు లెక్కలు వేసుకునే వరకు చర్చ నడచింది. ఆ తర్వాత ఎటువంటి హడా విడి లేదు. ఎన్నికల సంఘం ప్రకటన చేయ లేదు. అధికారంలో ఉన్న కూటమి పార్టీల అధిష్ఠానాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. నియోజకవర్గ నాయకత్వానికి సంకేతాలు పంపలేదు. నామినే టెడ్ పదవుల నియామకంపైనే కూటమి అధి ష్టానం దృష్టి పెట్టింది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు నామినేటెడ్ పదవులు లభిం చేలా తలమునకలైంది. ఇటీవల సహకార సం ఘాల త్రిసభ్య కమిటీల గడువును మరో ఆరు నెలలపాటు పొడిగించారు. వివిధ కార్పొరేషన్ లకు డైరెక్టర్ పదవులను ప్రకటిస్తూ వచ్చింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 9న పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించాలని దిశా నిర్దేశం చేసింది.
జనవరి ఒకటో తేదీ కటాఫ్
గడచిన జనవరి ఒకటో తేదీ నాటికి ఓటర్లుగా నమోదై ఉన్న వారి జాబితాను ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. దాంతో మళ్లీ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మేజర్ పంచాయతీల్లో ఎన్నికలపై శ్రేణులు చర్చించుకుంటున్నారు. కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులను అంచనా వేసుకుంటున్నారు. గ్రామ కేడర్‌తో చర్చలు జరుపుతున్నారు. ఎంఎల్‌ఎలు, ఇన్‌ఛార్జ్‌ల వద్దకు ఆశావహులు వచ్చి కలుసుకుంటున్నారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య పొసగడం లేదు. ఒకరి నీడ మరొకరిపై పడనం తగా వారి మధ్య పొగ రాజుకుంది. పంచాయతీ ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని ఒకింత ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయమై నేతల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. కూటమి అధిష్ఠా నం వద్ద ఇలాంటి నియోజకవర్గాల్లో నేతల కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. కూట మిలో కొందరు అసంతృప్తి వాదుల వ్యవహార శైలి నేతల మధ్య చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తోంది. అయినా సరే అధిష్ఠానం పార్టీని బలోపేతం చేయాలంటూ నియోజకవర్గ బాధ్యులకు సంకేతాలు ఇస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీపరమైనవి కావు. పరోక్షంగానే పార్టీ ప్రమేయం ఉంటుంది. ఆర్థికపరమైన చేయూత పార్టీ నేతలు ఇస్తుంటారు. దీనిపైనే కేడర్‌లో చర్చ జరుగుతోంది. కూటమి నేతల మధ్య పొసగని నియోజకవర్గాల్లో కలసి వెళతారా..? లేదంటే ఎవరికి వారే అభ్యర్థులను రంగంలోకి దింపుతారా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
మండల పరిషత్, మున్సిపా లిటీలు, జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం కూటమి మధ్య సర్దుబాటు ఉండనుంది. అధిష్ఠానమే చొరవ చూపి కూటమిలో స్థానిక సంస్థల సర్దుబాటు ఉండేలా చూసే అవకాశం ఉంది. నేతల మధ్య పొసగని నియోజకవర్గాల్లో మరింత ఫోకస్ పెట్టనుంది. ముందుగా వచ్చే పంచాయతీలపైనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఆశావ హులు అంతా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు తహతహలాడుతున్నారు.