లడ్డూ తయారీ కాంట్రాక్ట్ టెండరు వివాదాస్పదం
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:08 AM
ద్వారకాతిరుమల చినవెంకన్న లడ్డూ తయారీ కాంట్రాక్ట్ టెండర్ ఎవరికీ ఖరారు కాకముందే వివాదం రాజుకుంది. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ లు 22 నెలలుగా కట్టడం లేదంటూ కొందరు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తు న్నారు.
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల చినవెంకన్న లడ్డూ తయారీ కాంట్రాక్ట్ టెండర్ ఎవరికీ ఖరారు కాకముందే వివాదం రాజుకుంది. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ లు 22 నెలలుగా కట్టడం లేదంటూ కొందరు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తు న్నారు. అటువంటి వ్యక్తిని బ్లాక్ లిస్ట్‌లో ఉంచ కుండా కొందరు అధికారులు కొమ్ము కాస్తున్నా రంటూ ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుత కాం ట్రాక్టర్ అన్నీ చెల్లించాడని ఇంతవరకు టెండర్ ఎవరికీ ఖరారు కాలేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఇటీవల టెండరు పిలిచారు. ఇందులో రవికృష్ణ మాన్‌పవర్ ఏజన్సీ, ఎం.విజయచంద్ మాన్ పవర్, జీకే మాన్ పవర్, ఎం.రవికుమార్ అని నలుగురు టెండర్లు వేశారు. ఈ క్రమంలో ఈనెల 6న టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేశారు. ఇంకా ప్రైజ్ బిడ్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు గత 22 నెల లుగా కట్టడం లేదంటూ ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. టెండర్ నిబంధనలు ప్రకారం ప్రతి కాంట్రాక్ట్ దారుడు తప్పనిసరిగా లేబరు లైసెన్సు, పాన్ కార్డు, జీఎస్టీ నంబరు, ఫుడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. టెండరు షెడ్యూల్‌తో పాటు లేబరు లైసెన్స్, పాన్‌కార్డు జిరాక్సు, జీఎస్టీ రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్, ఫుడ్ సర్టిఫికేట్, కనీసం 40మంది కార్మికులకు ఈపీఎఫ్, ఈ ఎస్‌ఐ కట్టిన జిరాక్స్ కాపీలు అందజేయాల్సి ఉంది. లేకుంటే టెండరు తిరస్కరిస్తారు. ఇది లా ఉంటే ప్రస్తుతం టెక్నికల్ బిడ్‌ను తెరచిన అధికారులు ఇంకా టెండర్‌ను ఎవరికీ ఖరారు చేయలేదు. ఈ సమయంలో వివాదం చెలరేగు తోంది. ప్రస్తుత కాంట్రాక్టర్ గతనెలకు సంబంధించిన కేవలం 11 మంది కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు మాత్రమే కట్టాడని, గత 22 నెలలుగా కార్మికులకు కట్టడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ వైసీపీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అతనికే మళ్లీ టెండరు కట్టబెట్టేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా రంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత విభాగం ఏఈవో మెట్టపల్లి దుర్గారావు వివరణ ఇస్తూ.. ‘ప్రస్తుతం టెండరు ఎవరికి ఖరారు చేయలేదు. కమిటీలో విషయాన్ని ఉంచాం. ప్రసాదాల కాంట్రాక్టర్లు కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు కట్టకుంటే వారికి బిల్లులు విడుదల చేయం. ప్రస్తుత కాంట్రాక్టర్ ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు కట్టడం వల్లే బిల్లులు చెల్లించా’మన్నారు.