Share News

జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టి ప్రణాళిక

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:19 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో పొరపాట్లకు తావివ్వ కుండా... ప్రజా ప్రతి నిధులతో అధి కారులు సమన్వయం చేసుకుని జిల్లా సమ గ్రాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ దిశా నిర్దేశం చేశారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టి ప్రణాళిక

జిల్లాలో 4,678కి ఇళ్ల స్థలాలు సిద్ధం

మే నెలాఖరు నాటికి రోడ్లన్నీ పూర్తి కావాలి

యూరియా, నకిలీ విత్తనదారులపై పీడీ యాక్టు

డీఆర్సీ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల

ప్రజా సమస్యల పరిష్కారంలో పొరపాట్లకు తావివ్వ కుండా... ప్రజా ప్రతి నిధులతో అధి కారులు సమన్వయం చేసుకుని జిల్లా సమ గ్రాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్‌ లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం (డీఆర్సీ) జరిగింది. మంత్రి కొలుసు పార్థ సారఽథితో కలిసి నాదెండ్ల సమీక్షించారు.

ఏలూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): డీఆర్సీ సమావేశం ప్రారంభ కాగానే తొలుత గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల నివేదికపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు, అధి కారులు ఆపై అజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధా నంగా పోలవరం పునరావాసం, కాలనీల అభివృద్ధి ఎజెం డాలో పెట్టి సమీక్షించారు. పాపికొండల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అటవీ, జలవనరుల శాఖ ద్వారా ప్రతిపాదనలు చేయాలని తీర్మానించారు. యూరియాను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసేవారిపై, నకిలీ విత్తనాలతో మోసం చేసే దళారులు, వ్యాపారులపై పీడీ యాక్టును అమలు చేయాలని, క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎస్పీ కిశోర్‌, జేసీ అభిషేక్‌ గౌడలకు మంత్రి నాదెండ్ల ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో భాగంగా ప్రతి పథకంపై ప్రత్యేక దృష్టి కేం ద్రీకరిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలో 200 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

మంత్రి నాదెండ్ల ఏమన్నారంటే...

‘22ఏ నిషేధిత భూములపై 213 అర్జీలు రాగా ఇందులో 20 సమస్యలపై 1,199 మందికి చెందిన 142.04 భూము లపై నిషేధం ఎత్తివేశాం. 31.90 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధం చేశాం ఇప్పటి వరకు 97,144 మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశాం. మరో 4,678 సిద్ధం చేశాం. ఉద్యాన, వాణిజ్యపంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతేడాదిలో ఉద్యాన పంటలతో 7,693 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 9,006 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నాం. పోలవరం పునారావాసంలో భాగంగా 14 గ్రామాలకు 13 గ్రామాలకు సర్వే పూర్తి చేశాం. మిగిలిన గ్రామంలో నిర్వా సితులకు ప్రత్యేక గ్రామసభ ద్వారా నష్టపరిహారం చెల్లింపు ల్లో న్యాయం చేస్తాం. పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి, రిసార్ట్సు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తాం. మూడు ప్రధాన రహదారులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. రూ.120 కోట్లతో చేపట్టిన పనులన్నీ మే నెలాఖరు నాటికి పూర్తికి డెడ్‌లైన్‌ విధించా’మన్నారు.

అధికారులపై గరం..గరం..

యూరియా పంపిణీ, మొక్కజొన్న నకిలీ విత్తనాలపై మంత్రి నాదెండ్ల ఆరా తీసిన సమయంలో కేసుల నమోదు తక్కువ కావడంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జేడీ హబీబ్‌ బాషా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మొక్కజొన్న రైతులతో అగ్రిమెంట్లు చాలాచోట్ల జరగడం లేదు.. కీలకంగా పంట వచ్చే దశ అయినందున.. నకిలీ విత్తన కంపెనీలపై సరైన చర్యలు తీసుకునే సమయం ఇదే’ అంటూ తెలిపారు. విత్తనం తీసుకునే సమయంలో ఆయా కంపెనీలపై చర్యలకు ఉపక్రమించాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ఆర్‌అండ్‌ రోడ్లు మరమ్మతులు, నూజివీడులో రెండు డ్రెయిన్ల నిర్మాణం పనులు సాగకపోవడంపై మంత్రులు నాదెండ్ల, కొలుసు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయరత్నంను ప్రశ్నించారు. రోడ్ల కాంట్రాక్టర్‌కు రూ.30 కోట్ల బకాయిలపై కలెక్టర్‌ స్పందిస్తూ.. ఇటీవల బిల్లులు చెల్లించిన కాంట్రా క్టర్లతో మాట్లాడించి పనులు పూర్తి చేయించాలన్నారు. 22ఏ నిషేధిత భూముల సమస్యలపై యంత్రాంగం తీసుకున్న చర్యలపై డీఆర్వో విశ్వేశ్వరరావు వివరించారు. ద్వారకాతిరుమల రాయలం చెరువులో మట్టి తవ్వకాలపై చర్చ సాగగా, మట్టిని పేదలు, రైతుల అవసరాలకు క్యూబిక్‌ మీటరు ఒక రూపాయికి ఇచ్చే అంశంపై వివరించాలని మంత్రి కొలుసు సూచించారు. ఉద్యాన పంటలు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఆటో మ్యుటేషన్ల సబ్సిడీలపై మైక్రో ఇరిగేషన్‌ పీడీ రామ్మోహన్‌ వివరించగా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మొత్తం గ్రౌండింగ్‌ కావాలని నాదెండ్ల సూచించారు. సమావేశంలో ఎంపీ పుట్టా మహేశ్‌ , జడ్పీ చైర్మన్‌ పద్మశ్రీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చాగంటి మురళీ కృష్ణ, జేసీ అభిషేక్‌ గౌడ, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ విన్నూత, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, విజయవాడ ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయడు పాల్గొన్నారు.

ప్రొట్‌కాల్‌పై చర్చ ...రగడ

డీఆర్సీ సమావేశం మందిరంలో వేదికపై ఎమ్మెల్యేలకు సీటు వేయకపోవడంపై ఎమ్మెల్యే చింతమనేని డీఆర్వో విశ్వేశ్వరరావును ప్రశ్నించడం చర్చకు దారితీసింది. వేదికపై డీఆర్సీ చైర్మన్‌గా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల, మరో మంత్రి కొలుసు పార్థసారఽథి, డీఆర్సీ వైస్‌ చైర్మ న్‌, జడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ నేమ్‌బోర్డులను సీట్ల ముందు పెట్టారు. దీనిపై మంత్రి నాదెండ్ల, కలెక్టర్‌ చర్చించుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేదికపై కూర్చు నేలా ఏర్పాట్లు చేశారు. తనకు ప్రొటోకాల్‌ పాటించ డం లేదని, ఏలూరు ఆర్డీవో అంబరీష్‌ ఫోన్‌ చేసినా ఎత్తడం లేదని, ఇదేమి నిర్లక్ష్యమంటూ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకట రమణ ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడు, కైకలూరుకు ఇదే పరిస్థితి ఉందని మంత్రి కొలుసు వ్యాఖ్యానించారు. అధికారు లందరూ విధిగా ప్రజాప్రతినిధులకు ప్రోట్‌కాల్‌ విష యంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మంత్రి నాదెండ్ల సూచించారు.

సెప్టెంబరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి

ప్రభుత్వ ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్లను సెప్టెంబరు నాటికి పూర్తి చేస్తాం. ఎస్సీ,ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇళ్లను సగంలో వదిలేసిన రాక్‌క్రీట్‌ నిర్మాణ సంస్థపై క్రిమినల్‌ కేసును పెట్టిస్తాం. యూరియా నిల్వలను సొసైటీల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

– మంత్రి కొలుసు పార్థసారథి

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

మాదేపల్లిలో టిడ్కో ఇళ్లకు సేకరించిన భూమిలో ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఈ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరుకు అవకాశం కల్పించాలి. నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యకు సంబధించిన దేవదాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలి.

– ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

కొల్లేరులో రోడ్ల పనులు అడ్డుకోవడం తగదు

కొల్లేరులో రోడ్ల మరమ్మతులకు నిధులొచ్చి సంవత్సర మైనా పనులు చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డు కోవడం తగదు. ఏలూరు–పంగిడిగూడెం, ఏలూరు– పెరి కీడు రోడ్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలి.

– దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

అర్హులకు ఇళ్లు ఇవ్వాలి

పెదనిండ్రకొలనులోని పేదల కాలనీలో 20 అడుగులు రోడ్డును 10 అడుగులు రోడ్డుకు తగ్గించారని కాలనీలో కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు తీసుకోలేదు. వారి స్థానంలో అర్హులకు మంజూరు చేయాలి. సీఎం ఇచ్చిన హామీ మేరకు నల్లజర్ల–లక్ష్మీపురం రోడ్డు పనులు చేప ట్టాలి. బువ్వనపల్లి– నిడమర్రు, వరదాపురం– దువ్వరోడ్డు మమ్మతులు చేయించాలి.

– ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

వైద్యులను నియమించాలి

జంగారెడ్డిగూడెంలో ఏరియా ఆసుపత్రిలో వైద్యు కొరతను పరిష్కరించాలి. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు పూర్తి చేయాలి. రాయ లం చెరువులో అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి.

– ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌

గ్రామ కంఠం భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

కైకలూరు నియోజవర్గ ఇళ్ల కాలనీలను మెరక చేయా లి. కొల్లేరు ఐదో కాంటూరు లోపు రోడ్లను అభివృద్ధి చేయాలి. మండవల్లి మండలంలో ఆరు ఎకరాల గ్రామ కంఠం భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి.

– ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

లంకగ్రామాలకు బస్సులను నడపాలి

ఏలూరు మండలంలోని కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించాలి.

– ఘంటసాలక్షి లక్ష్మి, వడ్డెర కార్పొరే షన్‌ చైర్మన్‌

Updated Date - Feb 08 , 2026 | 12:19 AM