Share News

వైట్‌ బర్లీ.. నో వర్రీ!

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:10 AM

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల వైట్‌ బర్లీ పొగాకు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్జీనియా పొగాకు పండించడం అధిక వ్యయప్రయాసలతో కూడినది కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా వైట్‌ బర్లీ పొగాకు సాగుకు గిరిజనులు మొగ్గు చూపుతున్నారు.

వైట్‌ బర్లీ.. నో వర్రీ!
జీలుగుమిల్లిలో సాగవుతున్న వైట్‌ బర్లీ పొగాకు పంట

పెట్టుబడులు.. శ్రమ తక్కువ

నికర ఆదాయానికి ఐటీసీ భరోసా

వర్జీనియా పొగాకుతో పోల్చితే సగమే ఖర్చులు

సాగుకు ఆసక్తి చూపుతున్న గిరిజన రైతులు

ఏజెన్సీలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

జీలుగుమిల్లి,ఫిబ్రవరి8(ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల వైట్‌ బర్లీ పొగాకు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్జీనియా పొగాకు పండించడం అధిక వ్యయప్రయాసలతో కూడినది కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా వైట్‌ బర్లీ పొగాకు సాగుకు గిరిజనులు మొగ్గు చూపుతున్నారు. కనీసం ఎకరం, రెండు ఎకరాల్లో కుటుంబ సభ్యులు నిత్యం తోటలో పని చేసుకుని తగిన ఆదాయం సమకూర్చుకునే వీలు ఉందని పేర్కొంటున్నారు. దీంతో మూడేళ్లుగా ఈ పంట సాగుపై చిన్నకారు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

పంట కొనుగోలు విక్రయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐటీసీ ప్రతినిధులు వీరికి భరోసా కల్పిస్తున్నారు. పంట అమ్మకం అనంతరం పొగాకు కొన్న రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. మరోవైపు నాణ్యమైన ఎరువులు పురుగు మందులతో పాటు పంట ఎండగట్టే దశలో వర్షానికి తడవకుండా టార్ఫాలిన్లు సరఫరా చేస్తు న్నారు. పంట కొనుగోలు అనంతరం ఎరువులు, ఇతర పురుగు మందులకు అయిన ఖర్చును మినహాయించుకుని మిగతా సొమ్ము జమ చేస్తారు. ఐటీసీ సిబ్బంది రైతులకు పంటసాగులో మెలకులవలు, సూచనలు ఇస్తారు. ఈ పంటకు సాగుకు వర్జీనియా పొగాకు పెట్టుబడితో పోలిస్తే సగమే ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. మరో విశేషం ఏమిటంటే గతంలో గిరిజనులు అటవీప్రాంతంలో పోడు భూములు సాగులోకి తెచ్చి ఎగుడు దిగుడు (ఎత్తు పల్లాలు) నేలల్లో పత్తి పంట సాగు చేసేవారు. ప్రస్తుతం అదే పోడు వ్యవసాయాన్ని పంట మార్పిడి చేసి వైట్‌ బర్లీ వర్షాధారంగా పండిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరులో నాటితే వర్షాకాలం పూర్తయ్యే లోపు వైట్‌బార్లీ పొగాకు ఏపుగా పెరు గుతుంది. ఎక్కువ తడులు అవసరం లేకుండా పంటను పెంచవచ్చని, ఎకరాకు ఖర్చులు పోను రూ.లక్ష వరకు మిగులుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు. నాటేం దుకు నారును సైతం ఐటీసీ అధికారులు సరఫరా చేస్తున్నా రు. ఈ సీజన్‌లో ఇప్పటికే కొందరు పెంచిన పంటను ఆకు రెలిచి పందిళ్లకు ఎండగడుతున్నారు. అనంతరం బేళ్లను తయారు చేసుకుని నిల్వ ఉంచి ఐటీసీ కొనుగోళ్లు ప్రారంభించగానే వారానికి పదిహేను రోజులకు ఒకసారి అమ్మకాలు జరుగుతాయి. ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది.

కిలోకు రూ.165

ధర విషయానికి వస్తే కిలో రూ.165కు ఐటీసీ ప్రతి నిధులు కొనుగోలు చేస్తారు. ఈ మేరకు ముందుగానే రైతు లతో ధర విషయమై ఒప్పదం కుదుర్చుకుంటారు. గతేడాది ధర కిలో రూ.150 నుంచి రూ.155 వరకు కొనుగోలు చేశార ని రైతులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వర్షాధారంతో బుట్టాయగూడెం, పందిరి మామిడిగూడెం, కామవరం, ఏపులపాడు, జీలుగుమిల్లి మండలంలో రెడ్డిగూడెం, దిబ్బగూడెం, అంకన్నగూడెం, పూచికపాడు, వేలేరుపాడు మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:10 AM