మహా కుంభ నివేదన
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:51 PM
తంగెళ్లమూడిలో జరుగుతున్న గంగానమ్మ, మహాల క్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాత రలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదన నిర్వ హించారు.
భక్తజనంతో కిటకిటలాడిన తంగెళ్ళమూడి
ఏలూరు కార్పొరేషన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తంగెళ్లమూడిలో జరుగుతున్న గంగానమ్మ, మహాల క్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాత రలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదన నిర్వ హించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వార్లను దర్శించుకుని కుంభంపోసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వేకువజాము నుంచే భక్తులు బారు లుతీరి నిరీక్షించారు. భారీ బారికేట్లు ఏర్పాటు చేసి నప్పటికి అంచనాలకు మించి భక్తజనం తరలివచ్చారు. మేడలకు మూడు వైపుల నుంచి ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రద్దీ సాయంత్రానికి కూడా తగ్గలేదు. మహాకుంభ నివేదన కార్యక్రమంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారఽథి, ఈడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేడల వద్ద ప్రాంతాలన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో కిటకిట లాడాయి. పోలీసులు, సత్యసాయి సేవా సంస్థల ప్రతి నిధులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు భక్తులకు సేవలందించారు. జాతర కమిటీ భక్తులకు ఏర్పాట్లు చేసింది.
నేడు కొర్లబండి ఊరేగింపునకు ఏర్పాట్లు
సోమవారం జరిగే కొర్లబండి ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాతర కమిటీ నాయకులు నెరుసు రామారావు తెలిపారు. మేళతాళాలు, బాజా భజంత్రీలు, విచిత్ర వేషాలు, డప్పు వాయిద్యాలు, వస ంతోత్సవాలు, కోలాట నృత్యాలతో వైభవంగా కొర్లబండి ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. సోమవారం ఉదయం 9.19 గంటలకు కొర్లబండి ఊరేగింపు ప్రారం భమవుతుందని తెలిపారు. తంగెళ్ళమూడి ప్రజలు 8వ తేదీన మహాకుంభ నివేదన, 9న కొర్లబండి ఊరేగింపు అని బంధువులు, ఆత్మీయులకు ఆహ్వానాలు అందజే యడంతో భారీ సంఖ్యలో వారంతా తరలిరావడంతో తంగెళ్ళమూడి ప్రాంతం భక్తజనమైంది.
జాతరకు పటిష్టమైన బందోబస్తు
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తంగెళ్ళ మూడి జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో ఆదివారం వేకువజాము నుంచి పటిష్ట మైన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి విఘాతం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ముంద స్తుగా తంగెళ్ళమూడి నుంచి కండ్రికగూడెం వెళ్ళే రోడ్డు లో వాహనాల రాకపోకలు నిలుపుదల చేసి భక్తుల కోసం ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యా ంగులకు పోలీసులు అండగా నిలిచి వారిని తోడ్కొని గంగానమ్మ మేడల వద్దకు తీసుకువెళ్ళి దర్శనాలు చేయించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం కొర్లబండి ఊరే గింపునకు కూడా పోలీసులు ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేశారు.