దిత్వా తుఫాన్ రైతుల్లో గుబులు రేపుతోంది. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు వరి పనలను కుప్పలుగా పెట్టారు.
మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్ బంద్ జీకేవీధి మండలం సీలేరులో కానరాలేదు.
వాతావరణంలోని మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు.
మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో ఆదివారం పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది.
స్థానిక మండల విద్యాశాఖ అధికారులకు సొంత గూడు లేకుండా పోయింది. ఈ కార్యాలయ భవనం ఐదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు వినియోగించడం లేదు. ప్రస్తుతం భవిత కేంద్రంలోని ఓ చిన్న గదిలో విధులు నిర్వహిస్తూ అధికారులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.
స్థానిక ఎకో పల్పింగ్ యూనిట్‌లో కాఫీ పల్పింగ్ మందకొడిగా సాగుతున్నది. ఐటీడీఏ నిర్వహణలో ఉన్న ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ (మ్యాక్స్) పండ్ల సేకరణలో ఈ ఏడాది వెనుకబడింది. కాఫీ పండ్లకు ధర ప్రకటించడంలో అపెక్స్ కమిటీ జాప్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఒక ఇంటిగ్రేటెడ్ కార్డు తీసుకురావాలని నిర్ణయించారు.
నకిలీ డీజిల్ మాఫియా రెచ్చిపోతోంది.
కింగ్‌జార్జి ఆస్పత్రి అధికారులు, వైద్యులపై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.