అనకాపల్లిలో సుడిగాలి కలకలం
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:55 AM
పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సంభవించిన గాలి దుమారం స్థానికులను కొద్దిసేపు భయాందోళనకు గురి చేసింది.
ఎన్టీఆర్ స్టేడియంలో 20 మీటర్ల ఎత్తున మినీ టోర్నెడోను తలపించిన దృశ్యం
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సంభవించిన గాలి దుమారం స్థానికులను కొద్దిసేపు భయాందోళనకు గురి చేసింది. మినీ టోర్నెడోను తలపిస్తూ సుమారు 20 మీటర్ల ఎత్తున గాలి సుడులు తిరిగింది. దీంతో దుమ్ము, ధూళి, చెత్తాచెదారం ఆకాశంలోకి ఎగిరింది. ఈ సమయంలో హోరుమంటూ శబ్దం రావడంతో స్టేడియంలో ఆడుకొంటున్న యువకులు భయంతో పరుగులు తీశారు. స్టేడియంలోని ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా వాయు పీడనం తగ్గడంతో సుడిగాలి సంభవించిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.