మన్యంలో కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. ఈ ఏడాది ముందుగానే కాఫీ పండ్ల దిగుబడి వచ్చింది. దీంతో ఏపీఎఫ్డీసీ అధికారులు, గిరిజన రైతులు నెల రోజుల ముందే పండ్ల సేకరణ పనులు ప్రారంభించారు.
మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం గ్రామంలో ఒక గిరిజనుడు సాగు చేస్తున్న అవకాడో మొక్కలు అధిక దిగుబడిని ఇస్తున్నాయి. అవకాడోలు కొనుగోలు చేసేందుకు స్థానికులు, మైదాన ప్రాంతీయులు ఆసక్తి చూపుతున్నారు.
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఎక్కడికక్కడే మోసాలు జరుగుతున్నాయి.
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో క్యాన్సర్ రోగుల కోసం పెట్ (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ...ఇది శరీరంలో కణజాలాల పరిశీలించడానికి చేసే వైద్య పరీక్ష) స్కాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా గుర్తింపుపొందిన విశాఖ నగరంలో భూములకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
జీవీఎంసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు సేవ చేసేందుకు ముందుకువచ్చే సంస్థలకు సింహాచలం దేవస్థానం అధికారులు తగిన అనుమతులు, సహకారం అందివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యారాడను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఎదురుగా ఉన్న కొండపై 350 ఎకరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండాపోయాయి. టమాటా ధర మోతెక్కిస్తోంది. ఉల్లి ఘాటు ఇంకా తగ్గలేదు.
రవాణా శాఖ సేవలను ప్రభుత్వం సరళీకృతం చేస్తున్నది. డ్రైవింగ్ ఎల్ఎల్ఆర్ (లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) సేవలను ప్రభుత్వం రవాణా శాఖ పరిధి నుంచి తొలగించింది. ప్రజలకు సేవలు సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.