వర్షాలు విరివిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు వరుణ యాగం నిర్వహించారు.
ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతితో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అడవులపై ఆధారపడే గిరిజనుల సుస్థిర జీవనోపాధికి చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ట్రైఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజమురుగన్ తెలిపారు.
మానవ అక్రమ రవాణా వంటి నేరాల పట్ల పోలీసు అఽధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్బర్దార్ సూచించారు.
సొంత శాఖలోని ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక ఆచార్య ఎన్జీరంగా సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అగ్రిసెట్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో తొలి ఆరు ర్యాంకులను కళాశాల విద్యార్థులు సొంతం చేసుకున్నారు.
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పెద్దగంగవరం గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
గురుకుల కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య సత్ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు వృత్తి విద్య కోర్సుతో పాటు కంప్యూటర్ విద్యపై పట్టు సాధిస్తున్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటనలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. సర్వీస్ తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రారంభం స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి అని రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివర్ణించారు.