Share News

ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:31 AM

నగరంలో ఎకో టూరిజం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు.

ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం

ఎంపీ ఎం.శ్రీభరత్‌

సింగపూర్‌, బెంగళూరులకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ డిజైన్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం

కైలాసగిరి, కంబాలకొండల్లో మరిన్ని సాహస క్రీడలు

నైట్‌ సఫారీ కూడా ఉండాలి

విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఎకో టూరిజం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. వీఎంఆర్‌డీఏలో పర్యాటక అభివృద్ధిపై సింగపూర్‌, బెంగళూరులకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ డిజైన్‌ సంస్థ ప్రతినిధులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. విశాఖలో వైవిద్యభరితమైన పరిస్థితులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కైలాసగిరి, కంబాలకొండల్లో మరిన్ని సాహస క్రీడలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నైట్‌ సఫారీ కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ప్రజలు, పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్‌; డీఎప్‌ఓ రవీంద్ర దామా, జూ క్యూరేటర్‌ మంగమ్మ, అడిషనల్‌ కమిషనర్‌ దాట్ల కీర్తి, సీయూపీ దివ్యలత, ఓఎస్‌డీ కృష్ణనాయక్‌, సీఈఓ వినయకుమార్‌, ఎస్‌ఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:31 AM