అల్లూరి సీతారామరాజు.. ధైర్యసాహసాలకు ప్రతీక: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jul 04 , 2026 | 09:36 AM
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోంమంత్రి అనిత పూలమాల వేసి నివాళులర్పించారు.
అనకాపల్లి జిల్లా, జులై 4: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోంమంత్రి అనిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి మన్యం వీరుడు అని కొనియాడారు.
అల్లూరి దేశభక్తి, ధైర్యం యువతరానికి ఆదర్శమని హోంమంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అల్లూరి జయంత్యుత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆయన త్యాగం ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలకు ప్రతీక అని హోంమంత్రి అనిత కొనియాడారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరోసారి అరెస్టు.. పాయకరావుపేటకు తరలింపు..
విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Read Latest AP News And Telugu News