Share News

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:50 AM

విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Vijayawada Road Accident

విజయవాడ, జులై 4 (ఆంధ్రజ్యోతి): విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిని రాజమండ్రికి చెందిన పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్, మార్కాపురం జిల్లాకు చెందిన వీఆర్ఏ గురవయ్యగా పోలీసులు గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురోహితుడు హరిప్రసాద్ ప్రయాణిస్తున్న కారులో బ్రేక్, ఎక్సలేటర్ మధ్య కొబ్బరికాయ ఇరుక్కుపోయింది. దీంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందుగా అదే మార్గంలో వెళ్తున్న వీఆర్ఏ గురవయ్య బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ముందున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్, వీఆర్ఏ గురవయ్య ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌పై జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


ఈ వార్తలు కూడా చదవండి...

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 06:56 AM