Share News

నేడు అల్లూరి జయంతి

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:31 AM

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కును ముస్తాబు చేస్తున్నారు. అల్లూరి, గంటందొరల సమాఽధులున్న ప్రాంతంలో తుప్పలు తొలగించి శుభ్రం చేయించి, కొత్తగా మొక్కలు నాటించారు. శనివారం ఇక్కడ నిర్వహించే అల్లూరి జయంతి కార్యక్రమానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.

నేడు అల్లూరి జయంతి
కృష్ణాదేవిపేట పార్కులో అల్లూరి, గంటందొర సమాధులు

కృష్ణాదేవిపేట పార్కులో ఏర్పాట్లు పూర్తి

హాజరుకానున్న స్పీకర్‌ అయ్యన్న, కలెక్టర్‌ విజయకృష్ణన్‌

విద్యార్థులతో భారీ ర్యాలీ

కృష్ణాదేవిపేట, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కును ముస్తాబు చేస్తున్నారు. అల్లూరి, గంటందొరల సమాఽధులున్న ప్రాంతంలో తుప్పలు తొలగించి శుభ్రం చేయించి, కొత్తగా మొక్కలు నాటించారు. శనివారం ఇక్కడ నిర్వహించే అల్లూరి జయంతి కార్యక్రమానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు కృష్ణాదేవిపేట రామాలయం వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి, అల్లూరి పార్కు వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. కాగా అల్లూరి పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం గొలుగొండ తహశీల్దారు వి.శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనివాస్‌, కృష్ణాదేవిపేట ఎస్‌ఐ వి.రుషికేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చిటికెల తారకవేణుగోపాల్‌, జిల్లాఉపాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, తదితరులు పరిశీలించారు.

Updated Date - Jul 04 , 2026 | 12:31 AM