Share News

ముసురు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:30 AM

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శుక్రవారానికి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై వుంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం తరువాత అడపాదడపా జల్లులు పడుతూనే వున్నాయి. మొత్తం మీద జిల్లా అంతటా ముసురు వాతావరణం నెలకొని వాతావరణం చల్లబడింది.

ముసురు..
కోటవురట్లలో వర్షం

పలుప్రాంతాల్లో తేలికపాటి జల్లులు

రానున్న రెండు, మూడు రోజుల్లో పెరగనున్న వర్షాలు

అనకాపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శుక్రవారానికి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై వుంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం తరువాత అడపాదడపా జల్లులు పడుతూనే వున్నాయి. మొత్తం మీద జిల్లా అంతటా ముసురు వాతావరణం నెలకొని వాతావరణం చల్లబడింది.

పాయకరావుపేటలో గురువారం రాత్రి నుంచి అడపాదడపా జల్లులు పడుతున్నాయి. శుక్రవారం రాత్రికి వర్షతీవ్రత కొంచెంది పెరిగింది. కచ్చా రోడ్లు బురదమయం అయ్యాయి. రహదారులపై గోతుల్లో నీరు నిలిచి పాదచారులు ఇబ్బంది పడ్డారు. గొలుగొండ మండలంలోని పలుగ్రామాల్లో శుక్రవారం మధ్యహ్నం నుంచి ముసురు వాతావరణం నెలకొని తేలికపాటి వర్షం కురిసింది. కోటవురట్ల మండలంలోని పలుగ్రామాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. సాయంత్రం తరువాత తీవ్రత కొంచెం పెరిగింది. ప్రస్తుతం పొలాల్లో వున్న సరుగుడు తోటలు, చెరకు, నువ్వు పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి, సబ్బవరం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనుండడంతో రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:30 AM