మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఆ తరువాత కాస్త ఎండకాసింది. పలు మండలాల్లో మధ్యాహ్నం వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది.
స్థానిక ఎన్నికలకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
జిల్లాలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
జిల్లాకు కేటాయించిన రెండు మహాప్రస్థానం వాహనాలను కలెక్టర్ టి.నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం రాత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో మినీ ఎకనామిక్ సిటీగా తయారవుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో వలసలు ఇంకా ఉన్నాయని.. వాటిని రూపుమాపుతామనిపేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ ఐఐఎంలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. MSME పాలసీ 4.0, ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు సీఐఐ సదస్సు అవగాహన కల్పించనుంది.
గంభీరంలోని ఐఐఎంలో బుధవారం జరగనున్న ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో రూ.4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. వీటి ద్వారా 23,256 మందికి ఉపాధి లభించనున్నది. బెర్రీ అల్లాయిస్ రూ.1,200 కోట్లతో విజయనగరం జిల్లాలో ప్లాంటు ఏర్పాటుచేయనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవంబరులో నిర్వహించనున్న సీఐఐ పెట్టుబడిదారుల ప్రధాన భాగస్వామ్య సదస్సుకు ముందుగా ప్రాంతీయ సదస్సులు ఏర్పాటుచేస్తోంది. అందులో భాగంగా తొలి సదస్సును బుధవారం ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 500 మంది వరకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హాజరుకానున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు.
ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వెల్లువలా వస్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆ విధంగానే విస్తరిస్తోంది. ముఖ్యంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా విజయనగరం-విశాఖపట్నం జిల్లాల శివారుల్లో లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నుంచి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసి తక్కువ ధర పేరుతో అమ్మేస్తున్నారు. మార్కెటింగ్ సిబ్బందిని రైతుబజార్ల వద్ద ఉదయం ఆరు గంటల నుంచే మోహరించి కొనుగోలుదారులను బుట్టలో వేసుకుంటున్నారు.
జిల్లాలో కొందరు మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. గత నెల 30వ తేదీతో దుకాణం లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ, తిరిగి రెన్యువల్ చేసుకోకుండా యథావిధిగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. రెండు, మూడు దుకాణాలు ఉన్న వ్యాపారులు ఇతర దుకాణాల నుంచి మద్యం తెచ్చి తమ దుకాణంలో అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తూ వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.