జేసీగా శౌర్యమాన్ పటేల్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:47 PM
జిల్లా జేసీగా శౌర్యమాన్ పటేల్ శనివారం రాత్రి 7.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబరులో తొలి సంతకం చేసి జేసీగా బాధ్యతలు చేపట్టారు.
అనకాపల్లి కలెక్టరేట్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా జేసీగా శౌర్యమాన్ పటేల్ శనివారం రాత్రి 7.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబరులో తొలి సంతకం చేసి జేసీగా బాధ్యతలు చేపట్టారు. పటేల్ ఇప్పటి వరకు అమరావతిలోని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రభుత్వం అనకాపల్లి జేసీగా నియమించడంతో పటేల్ ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా పట్టణంలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా అనకాపల్లి జేసీగా పనిచేసిన ఎం.జాహ్నవి మెటర్నరీ సెలవుపై వెళ్లారు.