నౌకల పండుగ
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:00 AM
విశాఖపట్నంలో భారత నౌకాదళం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచే నేవీ ఉత్సవాలు
విశాఖ చేరిన వియత్నాం, ఫిలిప్పీన్స్, మాల్దీవుల నౌకలు
ఆర్‌కే బీచ్‌లో యుద్ధ విమానాల రిహార్సల్స్
విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో భారత నౌకాదళం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026, మిలాన్‌లలో పాల్గొనడానికి 70 దేశాల నుంచి ప్రతినిధులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పటికే వియత్నాం, ఫిలిప్పీన్స్, మాల్దీవులకు చెందిన కోస్టుగార్డు నౌకలు తూర్పు తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 19న బీచ్‌లో సాహస విన్యాసాల ప్రదర్శన కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు ప్రాక్టీస్ చేస్తున్నాయి. కమోహ్, ధ్రువ్, సీ కింగ్ హెలికాప్టర్లు, డార్నియర్, హాక్, మిగ్-29కే యుద్ధ విమానాలు శనివారం ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేశాయి. చేతక్ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.