శైవక్షేత్రాలు ముస్తాబు
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:05 AM
మహా శివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):
మహా శివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆదివారం, సోమవారం కూడా పెద్దఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ఆలయాల్లో భారీగా ఏర్పాట్లుచేశారు. భక్తుల తాకిడి అధికంగా ఉండేందుకు అవకాశమున్నచోట దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇకపోతే, మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి భక్తులు జాగారం చేస్తారు. మరుసటిరోజు ఉదయం సముద్ర స్నానాలు చేస్తారు. అందుకు అనుగుణంగా ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి బీచ్‌ల వద్ద అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే, ఏటా మాదిరిగానే టీఎస్‌ఆర్ సేవా పీఠం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో మహా శివరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు. 41వ మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.