ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రిసోర్స్‌పర్సన్స్ (ఆర్పీల)పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మోతుకూరి రామ్‌చౌదరిపైకేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్పీల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని ఆర్పీలు, మెప్మా ఉద్యోగులు శనివారం డీఎీస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.
మార్కాపురం కోర్టు ప్రాంగణంలో రూ.5.20కోట్లతో నిర్మించిన 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల భవన సముదాయాన్ని శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్, జస్టిస్ డాక్టర్ వై.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి, కలెక్టర్ పి.రాజాబాబు మార్కాపురంలో హాజరయ్యారు.
జిల్లావ్యా ప్తంగా శనివారం ఉపాధి హామీ పథకం గ్రామసభలు విజయవంతంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కరోజే 729 పంచాయతీలలో వీటిని నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఆ శాఖ పర్యవేక్షణ అధికారి నుంచి క్షేత్ర స్థాయిలోని ఫీల్డ్ అసిస్టెంట్ వరకు వందలాది మంది డ్వామా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంపై దశా బ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దివ్యాంగు లకు డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ప్రకాశం భవన్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 57మంది దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్నారు.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన పల్లెవెలుగు బస్సులు జాతీయ రహదారులకే పరిమితమయ్యాయి. దీంతో పల్లె ప్రజలు రవాణా సదుపాయం కోసం అల్లాడిపోతున్నారు.
నియోజకవర్గం లో విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థ్ధానిక అమరావతి గ్రౌండ్‌లో నియోజకవర్గస్థాయి విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.95 కోట్లతో ఆర్డీఎస్ పథకం కింద పనులు చేపట్టినట్టు చెప్పారు.
జిల్లాలో రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికశాతం రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల నిర్వహణ విషయంలో చూపిన నిర్లక్ష్యం నేటికీ వెంటాడుతోంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమవుతోంది. దీంతో రూ.కోట్లు స్వాహా చేసిన ఆర్పీలు, వారి వద్ద ముడుపులు తీసుకొని సంపూర్ణ సహకారం అందించిన అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలైంది.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రానికి మత్స్యసంపద కీలక ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో దాన్ని మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.