Share News

పట్టణాభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:22 PM

మార్కాపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జీవీఎస్‌ నారాయణరావు అన్నారు. సోమవారం విజయవాడలోని హుడా ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.

పట్టణాభివృద్ధికి సహకరించాలి
అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ నారాయణరావు

మార్కాపురం వన్‌టౌన్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జీవీఎస్‌ నారాయణరావు అన్నారు. సోమవారం విజయవాడలోని హుడా ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వివిధ శాఖల అధికారులను కలిశామన్నారు. ప్రజలపై భారం పడకుండా వివిధ వనరులను వినియోగించుకుని వాటిని అభివృద్ధి చేసుకోవాలని ఉన్నతాధికారులు తెలిపారన్నా రు. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే కందుల ప్రజలకు సదుపాయాలు కల్పించే లక్ష్యంలో వివిధ పనులు పరిశీలించారని, వనరులు గుర్తించారని ఈ మేరకు ఉన్నతాధికారులతో ఫోన్‌లలో మాట్లాడారని తెలిపారు. త్వరలో ఎంపీ, ఎమ్మెల్యే పట్టణంలో పర్యటించి సమగ్ర అభివృద్ధికి అవసరమైన వివిధ కార్యక్రమాలు చేపడతారని కమిషనర్‌ వివరించారు.

Updated Date - Feb 09 , 2026 | 11:22 PM