రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:42 PM
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి బాపట్ల - ప్రకాశం జిల్లా సరిహద్దు ఉప్పుగుండూరు సమీపంలోని జాతీయ రహదారిలో చోటుచేసుకుంది.
చినగంజాం/చీరాల, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి బాపట్ల - ప్రకాశం జిల్లా సరిహద్దు ఉప్పుగుండూరు సమీపంలోని జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కడవకుదురు రైల్వేస్టేషన్ సమీపంలో ఉంటున్న నక్కల గోపీ(20) విజయవాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి వెంకటరావు మాజీ సైనికుడు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చిన గోపీ మరో ఇద్దరు మిత్రులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై ఒంగోలులోని మిత్రుని వద్దకు వెళుతున్నారు. మార్గం మధ్యలో గడ్డి ట్రాక్టర్‌ను గోపీ వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చినగంజాం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.