పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:43 PM
మనస్తాపానికి గురైన వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పర్చూరు మండలం ఇనగల్లు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఇనగల్లు పొలంలో సంఘటన
ఇనగల్లు(పర్చూరు), ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : మనస్తాపానికి గురైన వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పర్చూరు మండలం ఇనగల్లు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తన పొలంలో పరుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన పోపూరి వెంకట్రావు(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య కూడా అనారోగ్యం పాలుకావటంతో గుంటూరు జిల్లా, నర్సాయపాలెంలో కుమార్తె వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ శివారులోని తన పొలంలో పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన గ్రామస్థులు చికిత్స నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్చూరు పోలీసులు తెలిపారు.