సత్వర పరిష్కార వేదిక ప్రజాదర్బార్
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:17 PM
ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికే ప్రజాదర్బార్ అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికే ప్రజాదర్బార్ అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే సంబంధిత శాఖ అదికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు ప్రజల సమస్యల పట్ల జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయని అనేక మంది నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి అర్జీలు అందించారు.