వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.
రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే యూరియా విక్రయించాలని, భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు హెచ్చరించారు.
సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం రూ.6వేలు మొత్తం సంవత్సరానికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకున్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సీఎస్‌పురం మండ లంలోని కంభాంపాడు, ఉప్పలపాడు గ్రామాల్లో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను అందజేస్తు న్నట్టు ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ టీవీఎన్‌ఎస్ మూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మండలంలోని మారెళ్ళలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, సోలార్ ప్రాజెక్టును, శంకరాపురంలోని సోలార్ ఏర్పాటుచేసే కుసుంను పరిశీలించారు.
: ప్రజలు పలు సమస్యలపై అందచేసిన వినతులను త్వరతిగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న అన్నారు.
ఒంగోలు సీసీఎస్ పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. అందులో ఒక మోస్ట్ వాంటెడ్ ఉన్నాడు.
రోడ్లు, భవనాల శాఖపై విజిలెన్స్ దృష్టి సారించింది. వివిధ అంశాలపై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆశాఖలో ఉద్యోగోన్నతుల కోసం ఇద్దరు ఉద్యోగులు అడ్డదారి తొక్కిన విషయం బహిర్గతమైంది. ఒకవైపు చదువు పేరుతో ఆ ఇద్దరూ సెలవు తీసుకొని, మరోవైపు సుమారు రూ.26లక్షల మేర జీతాలు డ్రా చేయడం విస్తుగొలుపుతోంది.
గత ప్రభుత్వ హయాంలో ఊళ్లు కడతామంటూ జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో అటు నేతల పోకడలు, ఇటు అధికారుల ఇష్టారాజ్యంతో అవకతవకలకు అడ్డే లేకుండా పోయింది. ప్రతిచోటా అవినీతి రాజ్యమేలింది.