అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీపై విషం
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:56 PM
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని, దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు టీడీపీ నేతలు చెప్పారు.
వైసీపీ నేతల ఆరోపణలను ఖండించిన అధికార పార్టీ నేతలు
కొత్తపేట(చీరాల), ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని, దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు టీడీపీ నేతలు చెప్పారు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొండయ్య చొరవతో పరుగెడుతుంటే వైసీపీ హయాంలోనే ప్రయత్నాలు జరిగాయని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్మడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ జనార్దనరావు, కౌన్సిలర్‌లు సత్యానందం, వెంకటరావు, లలిత, ఎబినేజరు, నాయకులు శరత్, నాసిక వీరభద్రయ్య, మల్లి రామకృష్ణ, నాగేంద్రమణి, వేణు తదితరులు పాల్గొన్నారు.