Share News

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు

ABN , Publish Date - Feb 11 , 2026 | 10:53 PM

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం.అనంతరాజు చెప్పారు.

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు
పూనూరులో కుళాయి నీటిని పరిశీలిస్తున్న ఎస్‌ఈ అనంతరాజు

జలజీవన్‌ మిషన్‌ పనులను పరిశీలించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల పరిశీలన

పర్చూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం.అనంతరాజు చెప్పారు. పర్చూరు, యద్దనపూడి, మార్టూరు మండలాల్లో జలజీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పరోగతిని డీఈఈ ఎస్‌ సతీ్‌షచంద్రతో కలసి పరిశీలించారు. కారంచేడు మండల పరిధిలోని స్వర్ణ, దగ్గుబాడు పీహెచ్‌సీల్లోని కమ్యూనిటీ శానిటరీ పనులను పరిశీలించి, త్వరిత గతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అలాగే దగ్గుబాడు గ్రామంలోని ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ సాంకేతిక సమస్యలపై సూచనలిచ్చారు. యద్దనపూడి మండలం, పూనూరు గ్రామంలో రూ.92.7లక్షల జలజీవన్‌ మిషన్‌ నిధులతో 610 ఇళ్లకు నీటి సరఫరా అందించే విధంగా ఏర్పాటు చేసిన నీటి కుళాయిలు, నీటి సరఫరా ప్రక్రియను ఆయన పరిశీలించారు. అలాగే గ్రామంలో నిర్మాణం చేస్తున్న వెటర్నరీ కమ్యూనిటీ సెంటర్‌ను సందర్శించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం తనిపెద్దివారిపాలెంలో రూ.27 లక్షల డీఎంఎఫ్‌ నిధులతో అభివృద్ధి చేసిన ఫిల్టర్‌ బెడ్‌లను పరిశీలించారు. మార్టూరు, కొనంకి, కోలలపూడిలో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ స్లాబ్‌ పెచ్చులు ఊడుతుండటంతో వాటి మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఏఈ కార్తీక్‌, ఎన్‌.చైతన్య, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 10:54 PM