‘మార్టూరు సెంటర్లో బైక్‌పై ఉన్న యువకుడు సడన్‌గా కిందపడ్డాడు. సాయం చేసేందుకు ఓ వ్యక్తి ఆ యవకుడి వద్దకు వెళ్లాడు. కింద పడిన వ్యక్తికి ఏమైనా దెబ్బలు తగిలాయా..? అని చూస్తూ సదరు వ్యక్తి యువకుడిని పక్కకు తీసి బైకు పైకి లేపాడు.
అడవి జంతువుల వేట కోసం ఉచ్చులు అమర్చడం కొందరికి ఆనవాయితీగా మారితే పంటల రక్షణ కోసం కొందరు ఏకంగా పొలాల కంచెలకు విద్యుత్ సరఫరా ఇస్తున్న కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.
జిల్లాలో గ్రామాల వారీ నీటి బడ్జెట్ (లెక్కల)పై నీటి యాజమాన్య సంస్థ దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఉపాధి హామీ పథకంలో జలసంరక్షణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి.
జిల్లావ్యాప్తంగా శనివారం పరిశుభ్రత పాటిద్దాం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ప్రతినెలా మూడో శనివారం రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు.
జిల్లాలో స్మార్ట్ రైస్ కార్డులను లబ్ధిదారులకు అందించే విషయంలో రేషన్‌షాపు డీలర్లు చేతులె త్తేస్తున్నారు. గతంలో ఉన్న అడ్రస్‌ల ప్రకారం పౌరసరఫరాలశాఖ అధికా రులు ఆ కార్డులను లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యతను డీలర్లకు అప్పగించారు.
బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బియ్యం ధరలు అధికంగా ఉండటంతో వాటిని సామాన్యులకు తక్కువ ధరకు అందిం చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఒంగోలులో ముందుగా శనివారం ఒక విక్రయ కేంద్రాన్ని ప్రారం భించారు.
డిసెంబరు 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.ఓంకార్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి కె.భరత్‌చంద్ర అన్నారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు సెంటర్లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
సీఎస్‌పురం మం డలంలోని భైరవకోన క్షేత్రాన్ని హైకోర్టు జడ్జి సుజాత శనివారం సందర్శిం చారు. ఆలయంలోని త్రీముఖ దుర్గాదేవి అమ్మవారిని, నగరేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో జరిగిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు.