Share News

వైసీపీని వీడి పలువురు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:19 PM

వెలిగండ్ల మండలం వెదుళ్లచెరువు పం చాయతీలోని బాలవెంగణపల్లికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి ఆధ్యర్యంలో ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి సమక్షంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీని వీడి పలువురు టీడీపీలో చేరిక
ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

వెలిగండ్ల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : వెలిగండ్ల మండలం వెదుళ్లచెరువు పం చాయతీలోని బాలవెంగణపల్లికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి ఆధ్యర్యంలో ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి సమక్షంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్నా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం నింపుతాయన్నారు. పార్టీలో చెరిన వారు కేతనబోయిన వెంకటేశ్వర్లు, అన్నేబోయిన క్రిష్ణయ్య, మేకల వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, పవన్‌ కుమార్‌, కేతనబోయిన వెంకట్రావు, వెంకటనారాయణ, నవీన్‌, వెలుగొండయ్య, రమణయ్య, నారాయణ, ప్రసాద్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్‌ రెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ బీరం వెంటేశ్వరరెడ్డి, సంపతి రాజగోపాల్‌, వెంకటేశ్వర్లు, మీనిగ కాశయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:19 PM