Share News

ఇంటికో వ్యాపారవేత్తను చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:11 AM

డ్వాక్రా గ్రూపు సభ్యులలో ఇంటికి ఒకరిని వ్యాపారవేత్తగా తయారుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్‌డీఏ పీడీ బి.సింగయ్య అన్నారు.

ఇంటికో వ్యాపారవేత్తను చేయడమే లక్ష్యం

మార్టూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా గ్రూపు సభ్యులలో ఇంటికి ఒకరిని వ్యాపారవేత్తగా తయారుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్‌డీఏ పీడీ బి.సింగయ్య అన్నారు. శుక్రవారం మార్టూరు వెలుగు కార్యాలయంలో సీడ్‌ క్యాపిటల్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు ఏపీఎం సురేంద్ర అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సింగయ్య మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలను చేసుకునే వారిని జిల్లాలో 25 మండలాలల్లో 1130 మందిని గుర్తించామ న్నారు. వారిలో మొదటి పెట్టుబడి కింద 611 మందికి ఒక్కొక్కరికి రూ.40 వేల సీడ్‌ క్యాపి టల్‌గా ఇచ్చామన్నారు. అదేవిధంగా వారిలో సక్రమంగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న 215 మందికి 1.5 కోట్లరూపాయలను జిల్లాలో పంపిణీ చేశామన్నారు. మార్టూరు మండలం లో 54 మంది అర్హులు కాగా, వారిలో 15 మందికి, ఒక్కొక్కరికి రూ.40 వేలను సహాయంగా అందించామన్నారు. ఇంకా 39 మందికి రూ.40 వేల వంతున మంజూరు చేశామన్నారు. జిల్లాలో 1130 మంది సీడ్‌ క్యాపిటల్‌ లబ్దిదారులకు, 968 మంది వీవోఏలకు, వెయ్యి మంది ఈసీ మెంబర్ల కు ఈ విషయంపై శిక్షణ ఇచ్చామన్నారు. వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్ష ఉన్న డ్వాక్రా మహిళలకు సహకారం అందించ డానికి సెర్ప్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమం అనంతరం వారు అరకు కాఫీ పాయింట్‌ను సందర్శించారు. కార్యక్రమంలో డీపీఎం రవీంద్ర, డీఆర్‌పీ రవీంద్ర, మహిళా సమాఖ్య అద్యక్షు రాలు నాసరమ్మ, పలువురు డ్వాక్రా మహిళ లు, వీవోఏలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబంలోనూ వ్యాపారి ఉండాలి

చినగంజాం : ప్రతి కుటుంబంలోను ఒక వ్యాపారి ఉండాలన్నదే విజన్‌ బిల్డింగ్‌ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.సింగయ్య అన్నారు. స్థానిక స్త్రీశక్తి భవన్‌లో మండల సమాఖ్య ఈసీ సభ్యులు, చెరుకుపల్లి, కొల్లూరు, అమృతలూరు, మార్టూరు, పర్చూరు, చినగంజాం, అద్దంకి మండలాల ఏపీఎంలు, సీసీలకు విజన్‌ బిల్డింగ్‌పై నిర్వహిస్తున్న ముగింపు శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి చివరి లబ్దిదారులైన సభ్యురా లుకు చేరేవిధంగా ఈ విజన్‌ ఉండాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందేలా డ్వాక్రా సంఘాల ద్వారా ప్రజలు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు.. ప్రణాళికలు తయారు చేసే సమయం లో తప్పనిసరిగా మంచి నిబద్ధతతో తయారు చేయాలన్నారు కార్యక్రమంలో డిపిఎం ఐబి.రవి, ఏపీఎంలు గద్దె పెద సుబ్బారావు, రమేష్‌, రామకృష్ణ, త్యాగరాజు, మండల సమాఖ్య అధ్యక్షురాలు కె.శారద, సీసీలు కె.వెంకటస్వామి, మాదవి, శ్రీలక్ష్మి, ఆయా మండలాల ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:11 AM