రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:21 PM
రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
జేసీ శ్రీనివాసులు
తర్లుపాడు, జనవరి 30 (ఆంధ్రజోతి) : రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని తహసీల్దార్ కేకే కిశోర్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా జీరో ఖాతాలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతరుల పేర్లతో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని 28 రెవెన్యూ గ్రామాల్లో భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. మండలంలో 1854 గాను 1850 సర్వే నెంబర్లకు 1723 ఎకరాలు గణాంకాలకు సంబంధించి జీరో ఖాతాలు ఇతరుల పేర్లమీద ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీఆర్వోలతో సమీక్ష నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పలు సూచనలు ఇచ్చారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈయన వెంట ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఆర్‌ఐ శ్రీచరణ్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీరెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.