మార్చి 15లోగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:16 PM
ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులన్నీ మార్చి 15 లోగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించా రు. డ్వామా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు.
పెండింగ్ పనులపై అధికారులకు
ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు ఆదేశం
మార్కాపురం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులన్నీ మార్చి 15 లోగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించా రు. డ్వామా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. పనులను మార్చి 15కు పూర్తి చేయడంతోపాటు అన్ని బిల్లులు కూడా అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నిఽధులు మురిగిపోకుండా సద్వినియోగం కావాలని అందుకోసం నిర్లక్ష్యం వీడి పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పూర్తయిన పనుల వివరాలు, బిల్లులకు సంబంధించి ఇతర అంశాలపై అధికారుల ద్వారా పలు విషయాలు అడిగిన సమాచారం తీసుకున్నారు. కొత్తగా చేపట్టే పనుల్లో ప్రాధాన్యతాక్రమంలో చూడాలని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో ముఖ్యంగా బాలికల వసతిగృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, కొన్ని చోట్ల చేయాల్సిన మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌తోపాటు జేసీ శ్రీనివాసులు హాజరైన ఈ సమావేశంలో డ్వామా పీడీ జోస్‌ఫకుమార్, పీఆర్ ఎస్‌ఈ అశోక్, ఆయా మండలాల్లోని ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి నుంచి కలెక్టరేట్ నుంచే విధులు
ఫిబ్రవరి మొదటివారం నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి తాను విధులు నిర్వర్తిస్తానని ఇన్‌చార్జి కలెక్టర్ పీ రాజాబాబు తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ పనులను పరిశీలించారు. వివిధ సెక్షన్‌లకు ఏర్పాటు చేస్తున్న గదులు సౌకర్యాలను జేసీ శ్రీనివాసులు వివరించారు. జేసీ పర్యవేక్షణ వల్ల పనుల్లో వేగం పెరిగిందని కలెక్టర్ అన్నారు. త్వరితగతిన మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.
జీవన ప్రమాణాల
మెరుగునకు కృషి చేయండి : ఆస్పిరేషనల్ బ్లాక్ సమీక్షలో కలెక్టర్
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ పి.రాజాబాబు అఽధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా పలు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 మండలాల్లో ఎర్రగొండపాలెం మండలం ఒకటి. ఇందులో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమం జనవరి 28 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 14తో ముగుస్తుందని చెప్పారు. గతేడాది వివిధ అంశాల్లో 100శాతం విజయవంతం చేసిన సందర్భంగా కేంద్రం నుంచి బంగారు పతకం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ విడత కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జేసీ శ్రీనివాసులు, టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, నోడల్ అధికారి ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.