ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:07 AM
ప్రజల చెంతకు సంక్షేమ పథకాలను అందించడమే ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
పేదలు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయం
పింఛన్‌ల పంపిణీలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
కొమరోలు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజల చెంతకు సంక్షేమ పథకాలను అందించడమే ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని దద్దవాడ గ్రామంలో శనివారం పెన్షన్‌లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధ్యేయమన్నా రు. అనంతరం ఇంటింటికీ వెళ్లి పింఛన్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, సొసైటీ బ్యాం కు చైర్మన్ బిజ్జం రవీంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ బిజ్జం వెంకటరామిరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు బిజ్జాల తిరుమల రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్‌రెడ్డి, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో చెన్నారావు, ఏపీవో మహాలక్ష్మి, ఏవో రాజశ్రీ, పంచాయతీ సెక్రటరీ రమణ, పంచాయతీ నాయకులు పాల్గొన్నారు.
పింఛన్‌లను సక్రమంగా పంపిణీ చేయాలి : జేసీ శ్రీనివాసులు
కొనకనమిట్ల : లబ్ధిదారులకు సక్రమంగా పింఛన్ పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడు తూ ప్రతి నెలా పింఛన్ సక్రమంగా అందుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. అధికారులు బాధ్యతగా పింఛన్‌లను పంపిణీ చేయాలని జేసీ సూచించారు. ఆయనతోపాటు అధికారులు పాల్గొన్నారు.
కంభం : మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్ షేక్ హుస్సేన్ (దాదా), టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రావిపాడు, చిన్నకంభం, తురిమెళ్ల, జంగంగుంట్ల తదితర ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు.
రాచర్ల : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేద కుటుంబాల ప్రజలకు ఆసరా అని ఎంపీడీవో ఎస్ వెంకటరామిరెడ్డి అన్నారు. మండలంలోని కాల్వపల్లి గ్రామంలో శనివారం ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తుముల రాజశేఖర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీలో అవకతవకలు లేకుండా చూడాలి
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి : ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీలో అవకతవకలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని గురవాజీపేట గ్రామంలో శనివారం పింఛన్లను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఎంతో ఆదరువుగా నిలుస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా పరిశీలించారు. అందుతున్న వైద్యసేవల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపరుచుకుని ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన కూటమి నేతల ముచ్చుమూరి చెంచిరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, కొండా కృష్ణారెడ్డి, ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సృజన సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల కల్లలో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కందుల
మార్కాపురం టౌన్, జనవరి (ఆంధ్రజ్యోతి): ప్రజల కల్లలో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం పట్టణంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభించారు. పలు వార్డుల్లో తిరిగి ప్రజలకు పింఛన్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, ఏఎమ్‌సీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, కౌన్సిలర్ నాలి కొండయ్య, టీడీపీ నాయకులు కనిగిరి బాలవెంకటరమణ, షేక్ మౌళాలి, దూదేకుల మస్తాన్, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పఠాన్ ఇబ్రహీంఖాన్, మేడిద రంగస్వామి, దూపాటి యలమంద, బాబీ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు నేరుగా పింఛన్‌లు : ఎరిక్షన్‌బాబు
పెద్దదోర్నాల : లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్‌లు, పథకాలను ప్రభుత్వం అందజేస్తుందని గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని చిన్నగుడిపాడు గ్రామంలో లబ్ధిదారులకు ఆయన శనివారం పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో వృద్ధులకు పింఛన్‌లు ఇచ్చే విషయమై ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. పెంచిన పింఛన్ డబ్బులను ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టి ఇచ్చారన్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే అధికారులు నేరుగా ఇంటివద్దకు వెళ్లి సక్రమంగా పింఛన్‌లను అందజేయడంతోపాటు సెలవు రోజులు వస్తే ఒకటిరెండ్రోజులు ముందుగానే డబ్బులు అందజేస్తున్నారని అన్నారు.
పామూరు : వివిధ వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న సామాజిక పింఛన్లతో సామాజిక భద్రత కలుగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు అన్నారు. మండలంలో ఫిబ్రవరి నెల పింఛన్ ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందచేయడంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. చింతలపాలెం గ్రామంలో డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ అలీ పాల్గొని పలువురికి పింఛన్లు అందజేశారు.