Share News

దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అక్రమాస్తులపై ఆరా

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:03 PM

దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అక్రమాస్తులపై ఆరా
ACB Raids

ప్రకాశం, జనవరి 31: ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ యాదల మహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB Raids) సోదాలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. దర్శి, నరసరావుపేటలోని మహేశ్వర రావు ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఆయన బంధువులు, స్నేహితుల నివాసాల్లోనూ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారని మున్సిపల్ కమిషనర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోదాలు కొనసాగుతున్నాయి.


దర్శి, నరసరావుపేట, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఆరు ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మహేశ్వర రావు ఎంత మొత్తంలో అక్రమార్జన చేశారన్న వివరాలను ఏసీబీ అధికారులు నేడు సాయంత్రం వెలువరించే అవకాశముంది.


ఇవి కూడా చదవండి...

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. చర్చించిన అంశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 01:15 PM