డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిత్తూరు నుంచి వర్చ్‌వల్‌గా గురువారం ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీడీవో వ్యవస్థ ద్వారా జిల్లాలో పంచాయతీరాజ్, డ్వామా భాగస్వామ్యంతో ప్రజలకు సేవలందిస్తారన్నారు.
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ఆరంభ మయ్యాయి.
మైదాన ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకున్నది.
విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బందరు మండలం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణాతరంగ్, అంతర కళాశాలల యువజనోత్సవాలు- 2025 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
‘అరకు చలి ఉత్సవ్’ను వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహిస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు, పలువురు అధికారులు బరితెగించారు. రికార్డులు, అగ్రిమెంట్లు, ఎం.బుక్‌లు లేకుండా చేసిన 69 పనులకు రూ.54.97 లక్షల బిల్లులు పెట్టారు. వాటిని చెల్లించాలని మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు రావడంతో బిల్లుల చెల్లింపులను అధికారులు నిలుపుదల చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పరిశీలించిన ప్రభుత్వం 19 మంది మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.
అసలే అధ్వానంగా వున్న జీకేవీధి-సీలేరు అంతర్రాష్ట్ర రహదారి... తుఫాన్ కారణంగా కురిసిన కొద్దిపాటి వర్షాని మరింత దారుణంగా తయారైంది. జీకేవీధి నుంచి లంకపాకల వరకు రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంచాయితీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి అంచనాలకు మించిన స్పందన వ్యక్త మవుతోంది.
వైసీపీలో సరైన విలువ, గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో దెందులూరు జడ్పీటీసీ నవకాంతం దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.