Share News

12 గంటలు.. 1500 వినతులు

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:58 PM

Centrak Minister Praja Darbar కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రజాదర్బార్‌కు అర్జీలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

12 గంటలు.. 1500 వినతులు
ప్రజాదర్బార్‌లో సమస్యలు వింటున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

కేంద్రమంత్రి ప్రజాదర్బార్‌కు అర్జీల వెల్లువ

అరసవల్లి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రజాదర్బార్‌కు అర్జీలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 12 గంటల్లో సుమారు 1,500 మంది నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి కేంద్రమంత్రికి సమస్యలను విన్నవించారు. సంబంధిత అధికారులతో కేంద్రమంత్రి ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు. ఓపికగా అర్జీలు స్వీకరించి.. వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని తెలిపారు.

Updated Date - Feb 16 , 2026 | 11:58 PM