రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:58 PM
శ్రీకాకు ళం రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ మధు సూదనరావు తెలిపారు.
ఆమదాలవలస, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): శ్రీకాకు ళం రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ మధు సూదనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రైల్వేస్టేషన్ సమీపాన కుద్దిరాం గ్రామం వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు సమా చారం మేరకు సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందన్నారు. గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుప త్రికి తరలించినట్టు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఆమదాలవలస జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో సంప్రదిం చాలని కోరారు.
గాయపడిన యువకుడు మృతి
మెళియాపుట్టి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): జోడూరు గ్రా మానికి చెందిన తిప్పాన భా ర్గవ్(19) ఆదివారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి చికిత్స పొందు తూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. ఆది వారం మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆకు లు తెచ్చేందుకు ద్విచక్రవాహనంపై పట్టుపురం గ్రామా నికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు గ్రామాల మధ్యలో అదు పుతప్పి చెట్టును ఢీకొట్టారు. తలకు బలమైన గా యాలు కావడంతో తొలుత టెక్కలి జిల్లా కేంద్రాసుప త్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుప త్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవా రం రాత్రి మృతి చెందాడు. తండ్రి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
బూర్జ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): చిన్నలంకాం గ్రామానికి చెందిన కొయ్యాన స్రవంతి(39) సోమవారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ప్రవ ల్లిక తెలిపిన వివరాల మేరకు.. స్రవంతి భర్త హరికృష్ణ మద్యానికి బానిసై ఇంటివద్దే ఉంటున్నాడు. పనికి వెళ్ల మంటే వెళ్లడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపం చెందిన స్రవంతి సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగింది. విషయం తెలుసు కున్న కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్రవం తి సోదరుడు నక్క వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.