హోరాహోరీగా బలప్రదర్శన పోటీలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:55 PM
శ్రీకృష్ణాపురంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా స్థాయి బలపదర్శన పోటీలు హోరా హోరీగా సాగాయి.
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణాపురంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా స్థాయి బలపదర్శన పోటీలు హోరా హోరీగా సాగాయి. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి ఆవాల గోవింద రావు (నిమ్మాడ), ద్వితీయ బహుమతి ముద్దాడ తరణ్ (తంగివానిపేట), వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో దోబ హేమశ్రీ (బోరవెల్లి) ప్రథమ స్థానం, తాలాడ కావ్య, సెనగల ఝూన్సీలకు ద్వితీయ స్థానం, బుడ్డెపు పవిత్ర తృతీయ స్థానంలో నిలిచారు. తీత ఈడుపు సంగిడీ పోటీల్లో ఆవాల గోవిందరావు ప్రథమ, గేదెల సత్యనారాయణ ద్వితీ య స్థానంలో నిలిచారు. ఉలవల బస్తా ఎత్తడంలో గేదెల సత్యనారాయణ, ఆవాల గోవిందరావు సమ ఉజ్జీలుగా నిలిచారు. విజేతలకు జ్ఞాపికలతోపాటు నగదు బహమతులు అందజేశారు. ఈ పోటీలకు మాజీ నేషనల్ వెయిట్‌లిఫ్టర్ పిలక ధనుంజయ కుమార్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి ఏఎంపీ వైస్‌చైర్మన్ బాడాన రమణమ్మ, టీడీపీ మండల కార్యదర్శి రెడ్డి అప్పన్న, గ్రామ పెద్దలు బాడాన లక్ష్మీనారాయణ, బాడాన అప్పన్న, ఎస్‌ఎల్ నాయుడు తదిరతులు పాల్గొన్నారు.