పేదలకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:53 PM
నిరుపేదకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): నిరుపేదకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు బాధితులకు రూ.2,40,324 విలువచేసే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం అందజేశారు. మండల పరిధిలోని పాతపట్నం గ్రామానికి చెందిన గొర్లె కూర్మారావుకు రూ.40,863, దశరఽథపురం గ్రామానికి చెందిన మామిడి గరికమ్మకు రూ.67,038, మెట్టపేట గ్రామానికి చెందిన కిడిగి సురేష్‌కు రూ.54,057, గంగువాడ గ్రామానికి చెందిన మామిడి పగడాలమ్మకు రూ.31,365, కొత్తూరు మండలం మెట్టూరు ఆర్‌ఆర్ కాలనీకు చెందిన తంగుడు రవికుమార్‌కు రూ.75వేలు చొప్పున సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బండి రవివర్మ, టీడీపీ నేతలు పైల బాబ్జీ, మడ్డు రామారావు, సైలాడ సతీష్, నల్లి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై హర్షం
పాతపట్నం/రూరల్ ఫిబ్రవరి 16(ఆంద్రజ్యోతి): విద్యార్థుల ఫీజు రీయిం బర్స్‌మెంట్ విడుదల చేయడంపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం నిద్ధతతో పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతీహామీ నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధవంతమైనపాలనతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.