• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

ఉక్కుకు తొలగని చిక్కులు

ఉక్కుకు తొలగని చిక్కులు

స్టీల్‌ ప్లాంటు విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయవాడ-హైదరాబాద్‌ బోయింగ్‌ వైడ్‌-బాడీ విమానాలు

విజయవాడ-హైదరాబాద్‌ బోయింగ్‌ వైడ్‌-బాడీ విమానాలు

విజయవాడ విమానాశ్రయం నుంచి విజయవాడ-హైదరాబాద్‌ మధ్య వైడ్‌బాడీ విమానాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్‌ చేసిన కృషి ఫలించింది. ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన నాయుడు కార్యాలయంలో గురువారం ఇండిగో ఫ్లైట్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ ఏకే సింగ్‌తో ఎంపీలు కేశినేని, జీఎం హరీశ్‌తో సమావేశం నిర్వహించారు.

నిర్లక్ష్యపు సేవలపై సీరియస్‌

నిర్లక్ష్యపు సేవలపై సీరియస్‌

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ప్రక్షాళన మొదలైంది. భక్తులకు సరైన సేవలు అందకపోవడంపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు.. ఈవో కిశోర్‌కుమార్‌పై వేటు వేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ కమిషనర్‌ క్యాడర్‌ కలిగిన మహేశ్వరరెడ్డిని నియమించారు. బుధవార ం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీజీఎస్‌ ద్వారా నిర్వహించిన సమీక్షలో పెనుగంచిప్రోలు దేవస్థానానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందట్లేదనే విషయం బయటపడటంతో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

రజకుల సమస్యల పరిష్కారానికి కృషి

రజకుల సమస్యల పరిష్కారానికి కృషి

రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి ప్రత్యేక కాలనీ ఏ ర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బు చ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 16వ డివిజన్‌లో రూ.17.70 లక్షల వ్యయంతో చేపట్టిన గౌతమి దోబిఖాన ఆధు నీకరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఫ్లై ‘ఓవర్‌’

ఫ్లై ‘ఓవర్‌’

నిడమానూరు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌కు జాతీయ రహదారుల సంస్థ మంగళం పాడేసింది. ఎన్‌హెచ్‌ విజయవాడ డివిజన్‌ అధికారులు పంపిన డీపీఆర్‌ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌) తిరస్కరించింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నిడమానూరు ఫ్లై ఓవర్‌ అవసరం లేదని నిర్ణయించింది. ఈ కారణంగా ఆ ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు డీపీఆర్‌ను పంపడంలో జరిగిన జాప్యం, మెట్రోరైల్‌ కారిడార్‌తో లింకుపెట్టడం వంటి చర్యలు కాలాతీతానికి దారితీశాయి. ఈలోపు విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ తుదిదశకు చేరుకోవడంతో మోర్త్‌ తన ఆలోచనను మార్చుకుని ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది.

ప్రజలకు చేరువగా పాలన

ప్రజలకు చేరువగా పాలన

సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేసిందని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం నర్సీపట్నం పాత మునిసిపల్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

మద్యం షాపులకు బెల్టు దెబ్బ

మద్యం షాపులకు బెల్టు దెబ్బ

మద్యం బెల్టు దుకాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఆ ప్రభావం మద్యం దుకాణాలపై పడుతున్నది. వైన్‌ షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. బెల్ట్‌ షాపులు లేకపోవడంతో అనుకున్న మేర మద్యం అమ్మకాలు సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతోపోలిస్తే.. లైసెన్స్‌ ఫీజు, షాపుల నిర్వహణ ఖర్చులు, అద్దెలు, సిబ్బంది జీతాలు అధికంగా వుంటున్నాయని, ఈ కారణంగా మద్యం షాపులను మూసివేసి, లైసెన్సులను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

 వైద్య సేవల్లో నిరక్ష్యాన్ని సహించం

వైద్య సేవల్లో నిరక్ష్యాన్ని సహించం

ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలందించడంలో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండంలోని రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తని ఖీ చేశారు.

జోరుగా వరి కోతలు

జోరుగా వరి కోతలు

వారం రోజుల విరామం తరువాత జిల్లాలో వరి కోతలు పునఃప్రారంభం అయ్యాయి. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి వాతావరణం తెరిపివ్వడంతో రైతులు వరి కోతల పనులను ముమ్మరం చేశారు. వారం క్రితం కుప్ప వేసిన రైతులు వరి పంటను నూర్చుతున్నారు.

పాడేరు ఘాట్‌ రోడ్డులో కర్రల లారీ బోల్తా

పాడేరు ఘాట్‌ రోడ్డులో కర్రల లారీ బోల్తా

పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ఘాట్‌ రోడ్డులో కోమాలమ్మ పనుకు మలుపు వద్ద గురువారం ఉదయం కర్రల లోడు లారీ అడుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి