Share News

గంట్లాంలో రెండు పూరిళ్లు దగ్ధం

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:44 PM

మండ లంలోని గంట్లాం గ్రామంలో సోమ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో జి. చిట్టిరాజు, ఎం. బంగారయ్యలకు చెందిన రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

  గంట్లాంలో రెండు పూరిళ్లు దగ్ధం
ఇనుప పెట్టెలోని కాలిపోయిన నగదు

రూ.30 లక్షల నగదు, 12 తులాల బంగారం కాలి బూడిదైన వైనం

డెంకాడ, ఫిబ్ర వరి 16 (ఆంధ్ర జ్యోతి): మండ లంలోని గంట్లాం గ్రామంలో సోమ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో జి. చిట్టిరాజు, ఎం. బంగారయ్యలకు చెందిన రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం సంభవించింది. స్థానికులు, బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ రాజారావు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాలు మేరకు జి.చిట్టిరాజుకు చెందిన సుమారు రూ.10 లక్షల నగదు, బంగారయ్యకు చెందిన రూ.20 లక్షల నగదు, 12 తులాల బంగారం, నిత్యవసర వస్తువులు బూడిదయ్యాయి. గ్రామస్థులే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ రాజారావు మాట్లాడుతూ ఈ సంఘటన ప్రమాద వశాత్తు జరిగినట్లు తెలిపారు. డెంకాడ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పశువులను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని బాధితులు ఇనుప పెట్టెల్లో దాచినట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 16 , 2026 | 11:45 PM